News September 12, 2024
బ్రోకరిజానికి అరికెపూడి నిదర్శనం: MLA కౌశిక్
TG: అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, కాదా అనేది ఆయన స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఆయన టీడీపీలో గెలిచి కేసీఆర్ దగ్గరికి, బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. బ్రోకరిజానికి ఆయన నిదర్శనం’ అని అన్నారు. ‘కేసీఆర్‌ను చీర కట్టుకుని బస్సు ఎక్కాలని సీఎం రేవంత్ అన్నారు. అందుకే నేను పార్టీ మారిన ఎమ్మెల్యేలను <<14075305>>చీరలు<<>>, గాజులు వేసుకోవాలని అన్నాను’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 7, 2024
పాజిటివ్ సిగ్నల్స్ పంపిన ఆసియా స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. జపాన్ నిక్కీ, తైవాన్ సూచీలు 2% మేర పెరిగాయి. హాంగ్‌సెంగ్, స్ట్రెయిట్ టైమ్స్, గిఫ్ట్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఎకానమీ, జాబ్ డేటా మెరుగ్గా ఉండటం, క్రూడాయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణాలు. పైగా డాలర్ ఇండెక్స్, బాండ్ యీల్డులు పెరిగాయి. RBI MPC ప్రభావం మన మార్కెట్లపై ఉండొచ్చు.
News October 7, 2024
టమాటా కిలో రూ.100
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా రేటు అమాంతం పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్లు, మండీలలోనే ధర రూ.80-90 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.100 దాటేసింది. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధర కూడా రూ.70-80కి చేరింది. కిలో బెండకాయలు రూ.70, బీన్స్ రూ.100, దొండ రూ.60, క్యాప్సికం రూ.80, బీరకాయ రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు.
News October 7, 2024
అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు ₹23 కోట్లు అంటూ ప్రచారం.. ప్రభుత్వం ఏమందంటే?
AP: ఇటీవల వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. బాధితులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందించడంతోపాటు మొబైల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ సమస్యలు తీర్చామని తెలిపింది. వాటన్నిటికీ కలిపి రూ.23 కోట్ల ఖర్చయిందని, అందులోనూ మొబైల్ జనరేటర్లకు ఎక్కువ మొత్తం వెచ్చించామని పేర్కొంది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరింది.