News February 8, 2025
ట్విటర్లో ‘EVM HACK’ ట్రెండింగ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న వేళ ‘EVM HACK’ హాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండవుతోంది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వైపు ఉన్నారని, ఫలితాలు సరైనవి కావంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. EVMలను హ్యాక్ చేసే అవకాశం ఉందనే అమెరికాలో బ్యాలెట్ ఓటింగ్ పెట్టారంటున్నారు. అయితే, మరికొందరు ‘ఓటమిని అంగీకరించకుండా ఇప్పుడు EVM హ్యాక్ అయిందని పోస్టులు పెడతారు’ అని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 7, 2026
వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!

ఎండ వేడిమికి మూగజీవాలు చల్లదనం కోసం ఆగి ఉన్న వాహనాల కింద తలదాచుకుంటుంటాయి. వాహనదారులు గమనించకుండా బండిని స్టార్ట్ చేసి ముందుకు తీయడం వల్ల ఇవి చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కూడా కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి వాహనం తీసే ముందు ఒక్కసారి కింద ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అలాగే మిద్దెపై, ఆరుబయట పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News March 7, 2026
సిలిండర్ ధరల పెంపు.. కేంద్రంపై ఖర్గే ఫైర్

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. డొమెస్టిక్‌పై ₹60, కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచడం సామాన్యులకు భారమేనని మండిపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు ద్రవ్యోల్బణంతో పీడిస్తున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, ఎరువుల కొరతను తీర్చలేని మోదీ ప్రభుత్వం అన్నీ బాగున్నాయంటూ ప్రగల్భాలు పలుకుతోందని X వేదికగా ఎద్దేవా చేశారు.
News March 7, 2026
పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

ఇరాన్-US యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం లీటర్‌పై ఏకంగా 55 PKR(17 శాతం) పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 266.17 PKR నుంచి 321.17 PKRకు పెరిగింది. హైస్పీడ్ డీజిల్ ధర లీటర్‌కు 280.86 నుంచి 335.86కి(20%) ఎగిసింది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని పాక్ పెట్రోలియం మంత్రి మాలిక్ అన్నారు. ఇండియాలోనూ <<19316911>>గ్యాస్ ధరలు<<>> పెరిగిన విషయం తెలిసిందే.


