News December 17, 2024

EVM హ్యాకింగ్: కాంగ్రెస్‌కు షాకిచ్చిన TMC

image

EVMలపై సందేహాలు లేవనెత్తేవారికి TMC MP, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చురకలు అంటించారు. వారివన్నీ ఉత్తుత్తి మాటలేనని కాంగ్రెస్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. అలాంటి ఆరోపణలు చేసేబదులు EVMలను ఎలా హ్యాక్ చేస్తారో ఎన్నికల కమిషన్‌కు డెమో చూపించొచ్చు కదాని ప్రశ్నించారు. ‘EVMను సరిగ్గా ర్యాండమైజేషన్ చేస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. పోలింగ్ బూతులో మాక్ పోలింగ్‌లో ఓటింగ్, కౌంటింగ్ చెక్ చేసుకోవచ్చ’న్నారు.

Similar News

News January 22, 2025

BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి

image

తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.

News January 22, 2025

దారుణం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించాడు!

image

హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకట మాధవి (35) అనే మహిళ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై అనుమానంతో భర్త గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 18 నుంచి మాధవి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

News January 22, 2025

‘ఉబర్’లో కొత్త మోసం!

image

ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబర్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. మొబైల్ ఛార్జింగ్ పర్సంటేజ్‌ను బట్టి ట్రిప్ ఛార్జిని నిర్ణయిస్తున్నట్లు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఫుల్ ఛార్జింగ్ నుంచి తక్కువ పర్సంటేజ్ గల నాలుగు మొబైల్స్‌లో ఒకే లొకేషన్‌కు ఉబర్‌లో బుకింగ్స్ చెక్ చేశారు. ఛార్జింగ్ తక్కువగా ఉన్న మొబైల్‌లో ఎక్కువ, ఫుల్ ఛార్జి ఉన్నదాంట్లో తక్కువ ధర చూపించింది. ఈ మోసాన్ని మీరెప్పుడైనా గమనించారా?