News May 10, 2024
కరెంట్ పోతే EVM పనిచేయదా?

ఓటు వేసే సమయంలో కరెంట్ పోతే ఈవీఎం పనిచేస్తుందా? లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉండొచ్చు. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించే ఈ ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తాయి. సాధారణ 7.5 వోల్ట్ ఆల్కలీన్ పవర్ ప్యాక్‌తో ఇవి పనిచేస్తాయి.
Similar News
News February 13, 2025
RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్?

IPL-2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ తమ కెప్టెన్‌ను ప్రకటించనుంది. రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ కెప్టెన్‌గా మెప్పించారు. మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్‌కు చేర్చారు. 2021 నుంచి RCBకి ఆడుతున్నారు. కాగా కోహ్లీ తిరిగి RCB కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News February 13, 2025
రజినీకాంత్‌పై RGV కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

రజినీకాంత్‌పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘క్యారెక్టర్‌ను బట్టి నటన ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లవుతారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రజినీ గొప్ప నటుడా? నాకు తెలిసి భిఖు మాత్రే పాత్రను(సత్యలో మనోజ్ బాజ్‌పేయి) ఆయన చేయలేడు. ఆయన ఏం చేయకపోయినా స్లో మోషన్‌లో నడిచొస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో RGV అన్నారు. దీంతో ఆయనపై రజినీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News February 13, 2025
మంచి మాట – పద్యబాట

కానివాని తోడ గలసి మెలగుచున్న
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ
భావం: దుష్టులతో కలిసి తిరిగితే మంచివాడిని కూడా ఈ లోకం చెడ్డవాడిగానే పరిగణిస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా.