News June 24, 2024

తిరుమల శ్రీవారి ఆలయంపై ఈవో సమీక్ష

image

AP: తిరుమల ఆలయ చరిత్ర, వాస్తు శిల్పం, విశిష్టత విషయాలపై అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. వైఖానస ఆగమము, జీయంగార్ల వ్యవస్థ, భక్తులకు అందించే సేవా కార్యక్రమాలపై ఆరా తీశారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని వివరాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 14, 2025

అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

image

AP: రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం లేదా CMO నామినేట్ చేసిన వారిని ఎంపిక చేయాలని ఉత్తర్వులిచ్చింది. వివిధ రంగాల్లో నిపుణులు, ప్రజల్లో మమేకమైన వారిని నైపుణ్యం, అర్హతల ఆధారంగా ఏడాది కాలానికి నియమించనున్నట్లు పేర్కొంది. అమరావతికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.

News February 14, 2025

ప్రేమికుల రోజు భార్యలతో క్రికెటర్లు!

image

వాలంటైన్స్ డే సందర్భంగా పలువురు క్రికెటర్లు తాము ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలతో గడిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి స్పెషల్ లంచ్‌కు వెళ్లిన ఫొటోను షేర్ చేశారు. మరో కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News February 14, 2025

IPL ఫ్యాన్స్‌కు షాక్!

image

జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా <<15456249>>ఏర్పడిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే IPL కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘జియో హాట్‌స్టార్’ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘హిందూస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దీనికి 3 నెలలకు రూ.149 చెల్లించాల్సి ఉంటుంది. Ad Free ఆప్షన్ కోసం రూ.499 వెచ్చించాలి. MAR 22 నుంచి IPL ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!