News June 13, 2024
జెన్కో ఏఈ పోస్టుల భర్తీకి జులై 14న పరీక్ష

తెలంగాణ జెన్కోలో ఏఈ పోస్టుల భర్తీకి వచ్చే నెల 14న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సీఎండీ రిజ్వీ తెలిపారు. జులై 3 నుంచి హాల్టికెట్లను సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 339 పోస్టులకు గత ఏడాది అక్టోబర్ 4న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31న రాత పరీక్ష జరగాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడింది.
Similar News
News December 1, 2025
SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in
News December 1, 2025
పంచాయతీలో ‘నోటా’.. మెజార్టీ ఓట్లు వచ్చినా?

TG: పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)ను ప్రవేశపెట్టారు. అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలక్షన్ను ఎన్నికల సంఘం రద్దు చేయదు. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది. నోటా అనేది కేవలం ఓటరుకు నిరసన తెలిపే హక్కుగానే పరిగణిస్తుంది. ఇప్పటికే పార్లమెంటు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ విధానం ఉంది.
News December 1, 2025
చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.


