News April 5, 2024
రేపటి నుంచే పరీక్షలు
ఏపీలో సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరీక్షల తేదీలు మారినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
Similar News
News January 14, 2025
స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలి: హరీశ్
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై డీజీపీ జితేందర్‌కి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలని కోరారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యేను అనూహ్యంగా త్రీటౌన్ స్టేషన్ కు తరలించారు. జడ్జి ముందుకు ప్రవేశపెట్టే విషయంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆయనకు స్టేషన్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
News January 14, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 14, 2025
చిన్నారులతో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చూసిన ఢిల్లీ బీజేపీ చీఫ్
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర చిన్నారులతో కలిసి వీక్షించారు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని తన పుట్టిన రోజు సందర్భంగా గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్ చిన్నారులతో చూశారు. ఈ విషయాన్ని ఆయన Xలో తెలియజేశారు. ఈ నెల 10న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది.