News October 3, 2024

ఆ ఒక్క స్టాక్‌ మిన‌హా మిగిలిన‌వ‌న్నీ రెడ్‌లోనే

image

JSW Steels (1.18%) మిన‌హా BSEలో మిగిలిన 29 స్టాక్స్‌ గురువారం రెడ్‌లోనే ముగిశాయి. LT అత్య‌ధికంగా 4.18% న‌ష్ట‌పోయింది. ఇటీవ‌ల సూచీలు జీవితకాల గ‌రిష్ఠాల‌ను తాకుతున్నాయి. అయినా ఒడిదొడుకుల మధ్య బుల్ జోరు కొనసాగింది. అయితే, ఓవ‌ర్ వాల్యూయేషన్ భ‌యాల‌కు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త‌త‌లు, క్రూడాయిల్ ధ‌ర‌లు తోడవ్వడంతో ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాలకు దిగారు. దీంతో ఒక్క‌రోజులోనే రూ.11 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరైంది.

Similar News

News March 4, 2025

చికెన్ 65కు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

image

చికెన్ 65 రెసిపీకి చాలా క్రేజ్ ఉంది. కానీ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని అందరికీ డౌట్ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంఎం బుహారి అనే చెఫ్ చెన్నైలో ఓ రెస్టారెంట్ స్థాపించారు. అందులో బ్రిటీష్ వారికి సరికొత్త మాంసాహారం అందించేవారు. ఓ సైనికుడు భాష సమస్య కారణంగా మెనూ కార్డులో 65వ నంబర్‌లో ఉండే చికెన్ వంటకం తెమ్మనేవాడు. మిగతా కస్టమర్లు కూడా అలానే చెప్పేవారు. అది కాస్త చికెన్ 65గా స్థిరపడింది.

News March 4, 2025

సెమీస్‌లో ఎదురే లేని టీమ్ ఇండియా

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోలేదు. సెమీస్‌కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్‌తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News March 4, 2025

మార్చి 04: చరిత్రలో ఈ రోజు

image

1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ప్రారంభం
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1973: డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం
1984: సినీ నటి కమలినీ ముఖర్జీ జననం
1987: నటి శ్రద్ధా దాస్ జననం

error: Content is protected !!