News September 17, 2024
మద్యం పాలసీపై అభిప్రాయాలు సేకరిస్తున్న ఎక్సైజ్ శాఖ
AP: రాష్ట్రంలో అమలు చేయనున్న కొత్త మద్యం పాలసీపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ ఆఫీసులో లేదా మంగళగిరి IHC టవర్స్‌లోని పాత సెబ్ ఆఫీసులో రాత పూర్వకంగా అందించవచ్చని లేదా apcommissioner.pe@gmail.comకు ఈమెయిల్ చేయవచ్చన్నారు.
Similar News
News October 10, 2024
‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం
AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News October 10, 2024
రతన్ టాటా అందుకున్న పురస్కారాలు
రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(UK), ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.
News October 10, 2024
నేడు క్యాబినెట్ భేటీ
AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం కానుంది. చెత్త పన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, దేవాలయాలకు పాలక మండళ్ల నియామకం, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై చర్చించే అవకాశముంది.