News August 11, 2024
జూ.ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర మూవీ గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చిత్రంలో దుమ్మురేపే ఓపెనింగ్ సాంగ్ షూటింగ్ మొదలైనట్లు వెల్లడించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, తారక్ గ్రేస్ మూమెంట్స్‌కు ఫ్యాన్స్ కేరింతలు కొడతారని తెలిపారు. సెట్స్‌లో దిగిన తన ఫొటోను షేర్ చేశారు. కాగా మూవీ నుంచి విడుదలైన చుట్టమల్లే సాంగ్ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News September 18, 2024
లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు
లెబనాన్‌లో <<14129580>>పేజర్లు<<>> పేలిన ఘటన మరువకముందే మళ్లీ అక్కడ వాకీ టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఈ ఘటనపై హెజ్బొల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై హమాస్, హౌతీ రెబల్స్ దాడులు చేస్తుండగా హెజ్బొల్లా కూడా రంగంలోకి దిగనుంది.
News September 18, 2024
శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత
టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో 80.90 యావరేజ్ కలిగిన రెండో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అగ్ర స్థానంలో బ్రాడ్‌మన్ (99.94) ఉన్నారు. మూడో స్థానంలో జైస్వాల్ (68.53) కొనసాగుతున్నారు. మెండిస్ తానాడిన తొలి 7 టెస్టుల్లోనే 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 809 రన్స్ సాధించారు. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గానూ నిలిచారు.
News September 18, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలో ఈ నెల 21 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.