News October 5, 2024

EXIT POLLS: హరియాణాలో కాంగ్రెస్‌దే అధికారం: CNN

image

హరియాణాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని CNN ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ 21 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 59 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారం దక్కించుకోనుందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చి చెప్పింది. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ కూడా కాంగ్రెస్ 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని పేర్కొంది.

Similar News

News December 17, 2025

త్వరలో కొత్త సర్పంచులతో సీఎం సమావేశం

image

TG: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులతో CM రేవంత్ భేటీ కానున్నారు. ఇవాళ తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ఈ నెల 20న సర్పంచుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత HYDలో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని CM నిర్ణయించారు. సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, సంస్థాగతంగా కాంగ్రెస్ క్యాడర్‌ను బలోపేతం చేయడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

News December 17, 2025

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

image

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.

News December 17, 2025

ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

image

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.