News October 5, 2024
EXIT POLLS: హరియాణాలో కాంగ్రెస్‌దే అధికారం: CNN

హరియాణాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని CNN ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ 21 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 59 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారం దక్కించుకోనుందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చి చెప్పింది. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ కూడా కాంగ్రెస్ 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని పేర్కొంది.
Similar News
News March 6, 2026
ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.
News March 6, 2026
RECORD: దేశంలోనే పిన్నవయసు CA

రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమారి పరేఖ్ చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యంత పిన్నవయసు ఛార్టెర్డ్ అకౌంటెంట్ (CA)గా నిలిచారు. ఇటీవల సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు. 19 ఏళ్ల 126 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. అంతకుముందు ఈ రికార్డు మధ్యప్రదేశ్‌కు చెందిన నందినీ అగర్వాల్ (19 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది. కాగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటి.
News March 6, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌పై షాకింగ్ ఆరోపణలు

ఎప్‌స్టీన్ కేసులో అదృశ్యమైన 16 పేజీల డాక్యుమెంట్లను US DOJ తాజాగా బయటపెట్టింది. ఇందులో 1983లో ఒక మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తాను అడ్డుచెప్పగా ట్రంప్ తనను కొట్టి అక్కడి నుంచి పంపేశారని ఆ మహిళ FBI విచారణలో పేర్కొంది. ఈ రికార్డులను ఇన్నాళ్లూ ఎందుకు దాచారనే అంశం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాగా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.


