News October 5, 2024

EXIT POLLS: జమ్మూకశ్మీర్‌లో అధికారం ఎవరిదంటే?

image

J&K ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారం చేపట్టే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేసింది. NC 33-35, కాంగ్రెస్ 13-15 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. బీజేపీ 23-27 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. అయితే మేజిక్ ఫిగర్ 46ను అందుకోలేక INC+NC 35-40 స్థానాలే గెలుస్తాయని దైనిక్ భాస్కర్, 43 సీట్లకే పరిమితమై హంగ్ ఏర్పడొచ్చని NDTV సర్వే వెల్లడించింది.

Similar News

News March 4, 2026

దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

image

దేశంలో వైట్ కాలర్ జాబ్స్‌ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.

News March 4, 2026

ఎండలు బాబోయ్..! ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్

image

దేశంలో ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు TGలో వచ్చే రెండు,మూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలను తాకుతుందని అంచనా వేసింది.

News March 4, 2026

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే 16 మంది లిస్ట్‌ను టీపీసీసీ హైకమాండ్‌కు పంపింది. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులతో చర్చించనున్నారు. ఆపై ఏఐసీసీ పేర్లను ఖరారు చేయనుంది. రెండు సీట్లలో ఒక స్థానానికి ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీని కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.