News November 25, 2024
IPL వేలంలో ఖరీదైన ప్లేయర్లు

* పంత్- రూ.27కోట్లు (లక్నో, 2025)
* శ్రేయస్ అయ్యర్-రూ.26.75కోట్లు (పంజాబ్, 2025)
* స్టార్క్-రూ.24.75కోట్లు (కోల్‌కతా, 2024)
* కమిన్స్-రూ.20.50కోట్లు (SRH, 2023)
* శామ్ కరన్-రూ.18.50కోట్లు (పంజాబ్, 2023)
* అర్షదీప్ సింగ్-రూ.18కోట్లు (పంజాబ్, 2025)
* కామెరూన్ గ్రీన్-రూ.17.50కోట్లు (ముంబై, 2023)
* బెన్ స్టోక్స్-రూ.16.25కోట్లు (చెన్నై, 2023)
* క్రిస్ మోరిస్-రూ.16.25కోట్లు(రాజస్థాన్, 2021)
Similar News
News October 19, 2025
రాష్ట్రంలో ACB మెరుపు దాడులు

TG: రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులపై ACB మెరుపు దాడులు చేపట్టింది. అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా, ఆసిఫాబాద్(D)లోని వాంకిడి, సంగారెడ్డి(D)లోని జహీరాబాద్, కామారెడ్డి(D)లోని కామారెడ్డి, మద్నూరు, భద్రాద్రి(D)లోని అశ్వారావుపేట చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టి పలువురిని ప్రశ్నించింది. రవాణాశాఖ చెక్పోస్టులపై ACB ఏకకాలంలో దాడులు చేపట్టడం ఇది రెండోసారి.
News October 19, 2025
నటి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

బిహార్ ఎన్నికల వేళ భోజ్‌పురి నటి సీమా సింగ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. NDA కూటమి అభ్యర్థి(LJP)గా ఆమె దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్లో లోపాలున్నాయని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో చాప్రా(D) మఢేరా అసెంబ్లీ స్థానంలో RJD, JSP మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అయితే నామినేషన్‌లోని చిన్నలోపంపై SECకి వివరించామని, సమస్య పరిష్కారమవుతుందని LJP చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెప్పారు.
News October 19, 2025
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్ 50 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు నవంబర్ 7లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://munitionsindia.in/career/