News November 25, 2024

IPL వేలంలో ఖరీదైన ప్లేయర్లు

image

* పంత్- రూ.27కోట్లు (లక్నో, 2025)
* శ్రేయస్ అయ్యర్-రూ.26.75కోట్లు (పంజాబ్, 2025)
* స్టార్క్-రూ.24.75కోట్లు (కోల్‌కతా, 2024)
* కమిన్స్-రూ.20.50కోట్లు (SRH, 2023)
* శామ్ కరన్-రూ.18.50కోట్లు (పంజాబ్, 2023)
* అర్షదీప్ సింగ్-రూ.18కోట్లు (పంజాబ్, 2025)
* కామెరూన్ గ్రీన్-రూ.17.50కోట్లు (ముంబై, 2023)
* బెన్ స్టోక్స్-రూ.16.25కోట్లు (చెన్నై, 2023)
* క్రిస్ మోరిస్-రూ.16.25కోట్లు(రాజస్థాన్, 2021)

Similar News

News December 9, 2024

పీహెచ్‌డీ చేస్తున్న వెంకటేశ్ అయ్యర్

image

స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ క్రికెట్‌తో పాటు చదువుపైనా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘60 ఏళ్ల వరకు క్రికెటర్ ఆడలేడు. చనిపోయే వరకు విద్య మనతోనే ఉంటుంది. మంచిగా చదువుకుంటే ఫీల్డ్‌లోనూ మంచి నిర్ణయాలు తీసుకునేందుకు నాకు దోహదపడుతుంది. అందుకే పీహెచ్‌డీ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. KKR ఇతడిని రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది.

News December 9, 2024

తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16 వరకు వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16కు వాయిదా పడ్డాయి. శాసన మండలిని కూడా 16వ తేదీ వరకు వాయిదా వేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో అసెంబ్లీ సమావేశాల తదుపరి కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

News December 9, 2024

విచిత్రం.. ఇక్కడ పడమరన సూర్యుడు ఉదయిస్తాడు!

image

సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం కామన్. అయితే, పడమరన ఉన్న పసిఫిక్ సముద్రంలో సూర్యుడు ఉదయించి తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమించడం మీరెప్పుడైనా చూశారా? ఇలా చూడగలిగే ఏకైక ప్రదేశం పనామా. ఇది సెంట్రల్ అమెరికాలోని ఓ దేశం. ఇక్కడి ఎత్తైన ప్రదేశం వోల్కానో బారుపై నుంచి చూస్తే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు.