News May 24, 2024
బిగ్‌బాస్కెట్ గోడౌన్‌లో డేట్ అయిపోయిన వస్తువులు!

బిగ్‌బాస్కెట్ గోడౌన్‌లో చేసిన తనిఖీల్లో డేట్ అయిపోయిన వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. HYD కొండాపూర్‌లోని మసీదు బండలో గడువు ముగిసిన చికెన్ మసాలా, చికెన్ సాసేజ్‌లు, పిజ్జా చీజ్, పనీర్, ఐస్‌క్రీమ్‌లు, పాలసీసాలు, థిక్ షేక్స్, ఇతర వస్తువులను కనుగొన్నారు. నిర్వాహకులకు నోటీసులిచ్చిన అధికారులు.. తాత్కాలికంగా లైసెన్సును రద్దుచేశారు. వినియోగదారులు ఎక్స్‌పైరీ డేట్‌ను చెక్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 5, 2026
ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.


