News September 18, 2024
లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు
లెబనాన్‌లో <<14129580>>పేజర్లు<<>> పేలిన ఘటన మరువకముందే మళ్లీ అక్కడ వాకీ టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఈ ఘటనపై హెజ్బొల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై హమాస్, హౌతీ రెబల్స్ దాడులు చేస్తుండగా హెజ్బొల్లా కూడా రంగంలోకి దిగనుంది.
Similar News
News October 4, 2024
ఒక్కో కార్మికుడికి ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్
పాలస్తీనా, లెబనాన్, ఇరాన్‌తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్‌లో ఏర్పడిన కార్మికుల కొరత భారతీయులకు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి భారత ప్రభుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్, వైద్య బీమా, వసతి లభిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే భారతీయులు అక్కడ పనిచేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.
News October 4, 2024
ఈ నెల 14న హ్యుందాయ్ IPO
దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద హ్యుందాయ్ IPO అక్టోబర్ 14న ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ భారతీయ విభాగం కంపెనీ, ప్రమోటర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.
News October 4, 2024
కేటీఆర్, హరీశ్‌పై కేసు నమోదు
TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్‌లో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేటీఆర్, హరీశ్‌తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.