News April 25, 2024

ఎన్నికల వేళ మణిపుర్‌లో పేలుళ్లు.. బ్రిడ్జి ధ్వంసం

image

మణిపుర్‌లో మరో రెండు రోజుల్లో రెండో దశ ఎన్నికలు జరగనుండగా మరోసారి హింస చెలరేగింది. కంగ్‌పోక్పి జిల్లా సపోర్‌మెయినా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పేలుళ్లకు పాల్పడి బ్రిడ్జిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. అయితే ఈ బ్రిడ్జి నాగాలాండ్‌కు కనెక్ట్ అయ్యే రహదారిలో భాగం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈనెల 26న రెండో విడత పోలింగ్ జరగనుంది.

Similar News

News January 24, 2025

గోల్డ్ రేట్స్ హైక్

image

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.82,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 పెరిగి రూ.75,550గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.వెయ్యి పెరిగి రూ.1,05,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

News January 24, 2025

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

image

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలనూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌తోనూ బాబు భేటీ అవుతారు.

News January 24, 2025

దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు

image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ సోదాలు లేదా పలు అంశాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.