News June 12, 2024
ఆధార్-రేషన్ అనుసంధాన గడువు పెంపు

ఆధార్-రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. జూన్ 30తో గడువు ముగియనుండగా మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలు అరికట్టేందుకు కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది. ఇంకా లింక్ చేయని వారు సమీప రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో చేసుకోవచ్చు. ఆధార్, రేషన్ కార్డుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
Similar News
News September 12, 2025
వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?

వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తక్కువ వేగంతో నడిస్తే క్యాలరీలు బర్న్ కావు. వేగంగా నడిస్తేనే గుండె, కండరాలు బలోపేతం అవుతాయి. ఫోన్ చూస్తూ వాకింగ్ చేయకూడదు. ఇలా చేస్తే వెన్ను, మెడ నొప్పి సమస్య వస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించి నడవాలి. ఖాళీ కడుపుతో లేదా అతిగా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మంచిది కాదు’ అని చెబుతున్నారు.
News September 12, 2025
భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.
News September 12, 2025
నేడే లాస్ట్.. టెన్త్ అర్హతతో 515 పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) 515 ఆర్టిసన్ గ్రేడ్ 4 పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. అభ్యర్థులు టెన్త్, ఐటీఐ పాసై 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.29,500 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి https://careers.bhel.in/ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.