News March 30, 2024
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉ.10 నుంచి మ.12 గంటల వరకు నిర్వహిస్తామంది. ఐదో తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎంపికైన వారికి విద్యాభ్యాసం ఇంగ్లిష్‌లోనే ఉంటుందని వెల్లడించింది.
వెబ్‌సైట్: <
Similar News
News March 9, 2026
విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్‌లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.


