News September 28, 2024
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు
TG: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పొడిగించింది. ప్రభుత్వ కళాశాలల్లో రూ.500 జరిమానాతో, ప్రైవేట్ కాలేజీల్లో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించింది. కాగా విద్యార్థులను చేర్పించే కాలేజీలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో? లేదో? గమనించుకోవాలని తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు సూచించింది.
Similar News
News October 4, 2024
ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్
చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం కడుపు నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరగా, రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. రజినీ నటించిన ‘వేట్టయాన్’ ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News October 4, 2024
డీఎస్పీగా నిఖత్ జరీన్
TG: బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ యూనిఫామ్‌లో కనిపించారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్-2024 ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆమెను సత్కరించి లాఠీని అందజేశారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం అని CM అన్నారు. బాక్సింగ్‌లో రాణించి మెడల్స్ సాధించినందుకు గాను ఆమెకు ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.
News October 4, 2024
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, యాదాద్రి, SRD, ADB, NML, NZB, JN, KMR, SDPT, NRPT, MDK, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు APలోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని APSDMA తెలిపింది.