News May 2, 2024
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
TG: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల వినతి మేరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 4 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియగా.. తాజాగా దాన్ని పొడిగించింది. కాగా ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News November 3, 2024
రిపబ్లిక్ డే గెస్ట్‌గా ఇండోనేషియా అధ్యక్షుడు?
ఈసారి గణతంత్ర వేడుకలకు(2025) ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభొవొ సుబియాంటో చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈనెలాఖరులో బ్రెజిల్లో జరగనున్న G-20 సదస్సులో PM మోదీ-సుబియాంటో భేటీకి అధికార వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సందర్భంగా వారు ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. కాగా గతనెలలోనే ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా సుబియాంటో ఎన్నికయ్యారు.
News November 3, 2024
TG ప్రభుత్వ నిర్ణయంపై గాంధీ మునిమనుమడి అసంతృప్తి!
హైదరాబాద్‌లోని బాపూఘాట్లో ఎత్తైన గాంధీ విగ్రహం <<14509125>>ఏర్పాటు<<>> చేయాలని TG ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. ఈ వార్తలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన ‘విగ్రహాల ఏర్పాటు పోటీకి నేను వ్యతిరేకిని. దయచేసి ప్రజాధనాన్ని రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నా’ అని హితవు పలికారు.
News November 3, 2024
హెజ్బొల్లాకు మరో షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్
హెజ్బొల్లా కీలక సభ్యుడు జాఫర్ ఖాదర్ ఫార్ను దక్షిణ లెబనాన్‌లో మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హెజ్బొల్లాకు చెందిన నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు జాఫర్ టాప్ కమాండర్‌గా ఉన్నట్లు తెలిపింది. గతంలో ఇజ్రాయెల్‌పై జరిగిన మిస్సైల్స్ దాడుల వెనుక ఇతడే ఉన్నట్లు పేర్కొంది. కాగా ఇటీవల హెజ్బొల్లా చీఫ్లుగా పనిచేసిన ఇద్దరిని IDF హతమార్చిన విషయం తెలిసిందే.