News February 18, 2025

కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

image

భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.

Similar News

News April 19, 2026

రాత్రి ఆలస్యంగా తింటే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే జీవక్రియ మందగించి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బరువు పెరుగుతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడంతో డయాబెటిస్ రావొచ్చు. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి’ అని సూచిస్తున్నారు.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.