News October 3, 2024
నందిగం సురేశ్ రిమాండ్ పొడగింపు

AP: YCP మాజీ MP నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మళ్లీ గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2021లో మంగళగిరిలోని TDP ఆఫీస్‌పై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో కార్యాలయంతోపాటు వాహనాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. వీడియోల ఆధారంగా పలువురిని అరెస్ట్ చేశారు.
Similar News
News December 12, 2025
భూముల్లో సూక్ష్మపోషక లోపాలు.. కారణం ఏమిటి?

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.
News December 12, 2025
భారత్ భారీ స్కోర్

మెన్స్ U-19 ఆసియా కప్-2025లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. UAEతో మ్యాచులో 50 ఓవర్లలో 433-6 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 171 రన్స్‌తో ఊచకోత కోశారు. ఆరోన్ జార్జ్ 69, విహాన్ మల్హోత్రా 69 పరుగులతో అదరగొట్టారు.
News December 12, 2025
హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి: CBN

AP: అత్యంత హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందుతుందని CM CBN ఆకాంక్షించారు. తూర్పునావికాదళ కేంద్రంగా, టూరిజమ్ హబ్‌గా ఉన్న విశాఖ ఇప్పుడు ఐటీ, ఏఐ, టెక్నాలజీ, నాలెడ్జ్ సిటీగా మారుతోందని అభివర్ణించారు. కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు భూమి పూజచేశామని, ఏడాదిలో 25వేల మందికి అవకాశాలు వచ్చి ఇక్కడినుంచి పనిచేయగలుగుతారని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని, మెట్రో కూడా వస్తుందని చెప్పారు.


