News October 3, 2024

నందిగం సురేశ్ రిమాండ్ పొడగింపు

image

AP: YCP మాజీ MP నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మళ్లీ గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2021లో మంగళగిరిలోని TDP ఆఫీస్‌పై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో కార్యాలయంతోపాటు వాహనాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. వీడియోల ఆధారంగా పలువురిని అరెస్ట్ చేశారు.

Similar News

News November 13, 2024

‘మిషన్ ఇంపాజిబుల్’లో బాలీవుడ్ బ్యూటీ?

image

బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌ని కలిశారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సెట్లో ఆయనతో కలిసి ఫొటో దిగారు. క్రూజ్‌ను కలవడం కలలా ఉందని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దానిపై మిషన్ ఇంపాజిబుల్ ఇన్‌స్టా పేజీ కూడా స్పందించింది. కాగా అవనీత్ ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.

News November 13, 2024

నేడు ఇండియాVSసౌతాఫ్రికా కీలక మ్యాచ్

image

4 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ T20 నేడు జరగనుంది. జొహనెస్‌బర్గ్‌లో రాత్రి 8.30గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా తొలి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టుబిగించాలని ఇటు మెన్ ఇన్ బ్లూ, అటు ప్రొటీస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ పిచ్ కాస్త పేస్‌కు అనుకూలించే ఛాన్సుంది.

News November 13, 2024

రాహుల్‌కు ఫ్రాడ్.. రేవంత్‌కు ఫ్రెండ్: KTR

image

TG: అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘‘అదానీ ఫ్రాడ్’ అని రాహుల్ గాంధీ అంటుంటే, ‘అదానీ నాకు ఫ్రెండ్’ అని రేవంత్ అంటున్నారు. గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ బెహతరీన్(అద్భుతం) అని రేవంత్ అంటున్నారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే అలాంటి ఫ్రాడ్ దగ్గరికి కాంగ్రెస్ CM రేవంత్ వెళుతున్నారు’’ అని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో KTR అన్నారు.