News May 26, 2024
ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2022 ఏప్రిల్ 30న మనోజ్ పాండేను ఆర్మీ చీఫ్గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 23, 2025
మూవీ అప్డేట్స్

✹ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో రానున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమంతో మొదలు.. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి
✹ ఇవాళ సాయంత్రం 6.11గంటలకు ‘రాజాసాబ్’ నుంచి రిలీజ్ కానున్న ‘రెబల్ సాబ్’ సాంగ్.. మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
✹ శివ నిర్వాణ, రవితేజ కాంబినేషన్లో రానున్న కొత్త మూవీ షూటింగ్ రేపటి నుంచి మొదలు!
✹ ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం తెలుగులో ‘అమరకావ్యం’గా విడుదల కానుంది
News November 23, 2025
రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్కు పాలనాధికారం ఉంది.
News November 23, 2025
విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.


