News December 10, 2024
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ: AISF
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై AP ప్రభుత్వం విచారణ చేయించాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘MBUలో ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్‌మెంట్‌ను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రతి విద్యార్థి దగ్గర ఏటా ₹20,000 అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన పేరెంట్స్‌ను మోహన్ బాబు బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. స్టూడెంట్స్‌ను ఫెయిల్ చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.
Similar News
News January 24, 2025
తీవ్ర నిరాశలో వైసీపీ శ్రేణులు
YCP అధినేత జగన్ వ్యూహాల వెనుక విజయసాయిరెడ్డిది కీలకపాత్ర. 2004 నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్‌తో పాటు జైలు జీవితం గడిపారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి తెర వెనుక వ్యూహరచన, తెర ముందు రాజకీయ విమర్శలతో పెద్దదిక్కుగా మారారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు నడిపారు. రేపు VSR రాజీనామా చేయనుండటంతో జగన్ ఒంటరవుతారని YCP ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.
News January 24, 2025
దోచుకున్న సొమ్ము బయటపెట్టు: సోమిరెడ్డి
AP: విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు <<15247358>>రాజకీయాల<<>> నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ‘2004-09 వరకు జగన్‌ను ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి. అప్పుడు దోచుకున్న రూ.43వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అని ట్వీట్ చేశారు.
News January 24, 2025
ఏపీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్.. ఎక్కడంటే?
ఏపీలోని భీమవరంలో ఈనెల 26న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరగనుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.230కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేశ్ హీరోగా నటించగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.