News November 23, 2024
తీవ్ర ఉత్కంఠ.. నాందేడ్‌లో కాంగ్రెస్ విజయం

MHలోని నాందేడ్ లోక్‌సభ సీటు ఉపఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. BJP, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడింది. చివరకు 1,457 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్‌రావ్ గెలిచారు. రవీంద్రకు 5,86,788 ఓట్లు రాగా, BJP అభ్యర్థి సంతుక్రావ్ హంబార్డేకు 5,85,331 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఆయన కుమారుడు రవీంద్రకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
Similar News
News November 17, 2025
అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు(1/2)

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.
News November 17, 2025
iBOMMA రవి భార్య వల్ల దొరికిపోయాడా? క్లారిటీ ఇదే!

iBOMMA నిర్వాహకుడు రవి భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులయ్యాయి. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్‌లోని విస్టా అపార్ట్మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.
News November 17, 2025
శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్సైట్: https://svuniversityrec.samarth.edu.in


