News November 23, 2024

తీవ్ర ఉత్కంఠ.. నాందేడ్‌లో కాంగ్రెస్ విజయం

image

MHలోని నాందేడ్ లోక్‌సభ సీటు ఉపఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. BJP, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడింది. చివరకు 1,457 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్‌రావ్ గెలిచారు. రవీంద్రకు 5,86,788 ఓట్లు రాగా, BJP అభ్యర్థి సంతుక్‌రావ్ హంబార్డేకు 5,85,331 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఆయన కుమారుడు రవీంద్రకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

Similar News

News December 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 10, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 10, మంగళవారం
దశమి: రా.3.43 గంటలకు
ఉత్తరాభాద్ర: మ.1.30 గంటలకు
వర్జ్యం: రా.12.39-2.08 గంటల వరకు
దుర్ముహూర్తం: 1)ఉ.8.39-9.24 గంటల వరకు
2)రా.10.43-11.34గంటల వరకు

News December 10, 2024

పవన్‌‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపుతానని ఆయన పేషీకి కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విజయవాడకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అటు, తనకు కూడా 2రోజుల కిందట ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పిన హోంమంత్రి అనిత.. ఆగంతకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని DGPని ఆదేశించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.