News August 5, 2024

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మేఘాలయలో నైట్ కర్ఫ్యూ

image

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో సా.6 నుంచి ఉ.6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రెస్‌టోన్ టిన్‌సాంగ్ వెల్లడించారు. బంగ్లాదేశ్‌తో మేఘాలయ 442 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దీంతో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు.

Similar News

News September 13, 2024

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్‌, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నారు. 1948 SEP 17న TGలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని CM తెలిపారు. ఆరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జెండా ఆవిష్కరిస్తారు.

News September 13, 2024

VLSRSAM క్షిపణుల ప్రయోగం విజయవంతం

image

ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల ‘వెర్టికల్ లాంఛ్’ స్వల్ప పరిధి క్షిపణుల్ని(VLSRSAM) భారత్ నిన్న, ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR)లో ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. తక్కువ ఎత్తులో తీవ్రవేగంతో ఎగిరే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించామని తెలిపింది. శత్రు విమానాలు, హెలీకాప్టర్లు, డ్రోన్ల వంటివాటిని ఈ క్షిపణులు నేలకూల్చగలవు.

News September 13, 2024

‘దేవర’ను ఇంటర్వ్యూ చేసిన యంగ్ హీరోలు

image

‘దేవర’ రిలీజ్ టైమ్(ఈ నెల 27) సమీపిస్తుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివను యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యంగ్ టైగర్‌తో ఫ్యాన్ బాయ్స్ ఇంటర్వ్యూ అదిరిపోయి ఉంటుందని, దీని కోసం ఎదురుచూస్తున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.