News November 5, 2024
చనిపోయినా కళ్లు చెదిరే సంపాదన!
లైసెన్స్, స్ట్రీమింగ్ హక్కులు, సేల్స్, ఇతర రూపాల్లో మరణానంతరం రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న ప్రముఖ సెలబ్రిటీల వివరాలను ఫోర్బ్స్ విడుదల చేసింది.
మైకేల్ జాక్సన్(2009 మరణం): 600మి.డాలర్లు, ఫ్రెడ్డీ మెర్క్యురీ(1991):250మి. డా, స్యూస్(1991): 75 మి.డా, ఎల్విస్ ప్రెస్లీ(1977): 50 మి.డా,
రిక్ ఒకాసెక్(2019): 45 మి.డా, ప్రిన్స్(2016):35 మి.డా, బాబ్ మార్లే(1981): 34 మి.డా, చార్లెస్ షుల్జ్(2000): 30 మి.డాలర్లు.
Similar News
News December 10, 2024
‘బిగ్‌బాస్’ నిలుపుదలకు హైకోర్టు నో
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ రియాలిటీ షో’ ప్రసారాన్ని నిలిపేయాలని దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ ప్రోగ్రాం అసభ్యంగా ఉందంటూ కొన్ని ఫొటోలను చూపించి షోను ఆపేయాలంటే సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషనర్‌కు అశ్లీలంగా అనిపించిన సీన్లు ఇతర ప్రజలకు అసభ్యం కాకపోవచ్చంది. కేబుల్ టీవీ నియంత్రణ చట్టం ప్రకారం సంబంధింత అధికారుల ముందు పిటిషనర్ తన అభ్యంతరాలను లేవనెత్తవచ్చని పేర్కొంది.
News December 10, 2024
‘LIC బీమా సఖి’.. నెలకు రూ.7,000 స్టైఫండ్
మహిళా సాధికారిత లక్ష్యంగా LIC బీమా సఖి యోజన పథకాన్ని PM మోదీ ప్రారంభించారు. ఏడాదిలో లక్ష మందిని నియమించుకోనున్నట్లు LIC MD సిద్ధార్థ్ మహంతి ప్రకటించారు. టెన్త్ అర్హత కలిగి 18-70ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. వీరికి మూడేళ్లపాటు ఆర్థిక అంశాలు, బీమాపై శిక్షణ ఇస్తారు. తొలి ఏడాది ₹7K, రెండో ఏడాది ₹6K, మూడో ఏడాది ₹5K చొప్పున ప్రతినెలా స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ తర్వాత LIC ఏజెంట్‌గా పనిచేయొచ్చు.
News December 10, 2024
BITCOIN: 24 గంటల్లో రూ.3.16లక్షలు లాస్
క్రిప్టో కరెన్సీ పెద్దన్న బిట్‌కాయిన్‌లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. 24 గంటల్లోనే $3736 (Rs.3.16L) నష్టపోయింది. నేడు మాత్రం స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. $97,318 వద్ద ఓపెనైన BTC $97,040 వద్ద కనిష్ఠ, $98,159 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. $477 లాభంతో $97,960 వద్ద చలిస్తోంది. ఇక ఎథీరియమ్ 4.86, XRP 10.45, సొలానా 5.78, BNP 4.96, DOGE 9, ADA 12.73, షిబాఇను 13% మేర పతనమయ్యాయి. క్రిప్టో Mcap తగ్గింది.