News June 28, 2024
విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్రశిక్ష విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతుల్లోని విద్యార్థులకు నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కాని విద్యార్థులను త్వరగా నమోదు చేయాలంది. కాగా గతంలో ఇదే విధానం టీచర్లకు సైతం అమలు చేసేందుకు విద్యాశాఖ యత్నించగా వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
Similar News
News February 15, 2025
SBI: లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గినట్లు తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది. ఎంసీఎల్ఆర్, బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.
News February 15, 2025
రేవంత్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: సీఎం స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. అటు మండల్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని, బీజేపీ వచ్చాకే అమలుపర్చిందని తెలిపారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
News February 15, 2025
5 ఖండాలను లింక్ చేస్తూ మెటా కేబుల్.. భారత్ కీ రోల్!

భారత్ సాయంతో ప్రపంచంలో అతి పొడవైన సముద్ర కేబుల్ వేసేందుకు మెటా కంపెనీ ప్లాన్ చేస్తోంది. 5 ఖండాలను లింక్ చేస్తూ 50వేల కి.మీ మేర సముద్రం లోపల కేబుల్ వేయనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు అని, ఏఐ సర్వీసులు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు మెయింటనెన్స్, ఫైనాన్సింగ్‌లో భారత్ కీలకపాత్ర పోషించనుంది.