News May 8, 2024
పోలింగ్ రోజున ఈసీ కల్పించే సౌకర్యాలు..
➥దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం. BLOలను సంప్రదిస్తే ఆటో ద్వారా ఓటర్లను తరలించే ఏర్పాట్లు చేస్తారు.
➥ఓటర్ల సహాయార్థం NCC, NSS, స్కౌట్స్‌ని వాలంటీర్లుగా నియామకం
➥పోలింగ్ బూత్‌లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం. ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్స్
➥చిన్నపిల్లల కోసం శిశుసంరక్షణ కేంద్రం
➥మహిళలు, పురుషులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు. కొన్ని చోట్ల మహిళల కోసం ప్రత్యేక బూత్‌లు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 5, 2025
భారత్‌కు షాక్
ఆస్ట్రేలియా ముందు 162 రన్స్ టార్గెట్ ఉంచిన భారత్.. ఆశలన్నీ స్టార్ బౌలర్ బుమ్రాపైనే పెట్టుకుంది. కానీ నిన్న గాయపడ్డ అతడు ఇవాళ బ్యాటింగ్‌కు వచ్చినా బౌలింగ్‌కు రాలేదు. అతడి ప్లేస్‌లో అభిమన్యు ఈశ్వరన్ ఫీల్డింగ్‌కు వచ్చారు. ఇక సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో AUS ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లలోనే 35 రన్స్ చేశారు. దీంతో భారత్ పరాజయం లాంఛనమే కానుందా?
News January 5, 2025
వ్యవసాయ సీట్లకు రేపు స్పాట్ కౌన్సెలింగ్
TG: వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు HYD రాజేంద్రనగర్‌లోని కాలేజీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈఏపీసెట్-2024లో ర్యాంకు సాధించి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. వివరాలకు www.pjtsau.edu.inను చూడండి.
News January 5, 2025
భారత్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా జడేజా(13), సుందర్(12), సిరాజ్(4), బుమ్రా(0) వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లతో చెలరేగారు. కమిన్స్ 3 వికెట్లు తీశారు. AUS గెలవాలంటే 162 రన్స్ కావాలి.