News February 25, 2025

హిజాబ్ తీయమన్నందుకు పరీక్షకు డుమ్మా!

image

యూపీలో హిజాబ్ కలకలం రేపింది. జౌన్‌పూర్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రంలో వెరిఫికేషన్ కోసం హిజాబ్ తొలగించాలని కోరగా 10 మంది విద్యార్థినులు అందుకు నిరాకరించారు. అంతటితో ఆగకుండా పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లిపోయారు. హిజాబ్‌తో అనుమతిస్తేనే పరీక్షలకు పంపుతామని విద్యార్థినుల తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. మరోవైపు ఫేస్ వెరిఫికేషన్ కోసమే తాము హిజాబ్ తీయమని కోరినట్లు కాలేజీ సిబ్బంది వెల్లడించారు.

Similar News

News March 18, 2025

వైసీపీకి షాక్: వైజాగ్ మేయర్‌పై అవిశ్వాసం?

image

AP: విశాఖ నగరపాలకసంస్థలోని వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు కాసేపట్లో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరనున్నారు. ఇందుకోసం వారు అమరావతి చేరుకున్నారు. వీరితో కలుపుకొని జీవీఎంసీలో కూటమి సభ్యుల బలం 75కు చేరనుంది. అనంతరం జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం GVMCలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

News March 18, 2025

తిరుగు ప్రయాణం మొదలు

image

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం గం.10.36ని.లకు ISS నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ సపరేట్ అయింది. దీంతో భూమ్మీదకు వారి ప్రయాణం ప్రారంభమైంది. రేపు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున గం.3:27కు ఫ్లోరిడా తీర జలాల్లో ల్యాండ్ కానుంది.

News March 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,500లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,000కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది. శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

error: Content is protected !!