News September 4, 2024
బుడమేరుపై ఫేక్ ప్రచారం.. ఫైర్ అయిన లోకేశ్

AP: కరకట్ట సేఫ్టీ కోసమే బుడమేరు గేట్లు తెరిచారని కొందరు ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. ‘వరదల్లో చిక్కుకొని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే, ప్రభుత్వం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే, సైకో జగన్ వికృతానందం చూడండి. బంగ్లాదేశ్ వరదల ఫోటోతో విజయవాడ వరదలు అంటూ ఫేక్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News July 8, 2025
ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.
News July 8, 2025
హై బడ్జెట్.. MEGA157 నాన్ థియేట్రికల్ రైట్స్‌కే రూ.100 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే రూ.100 కోట్ల వరకూ వసూలు చేయాలని, అలా చేస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నాయి. కాగా, MEGA157 చిత్రీకరణకు రూ.180 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
News July 8, 2025
శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.