News November 28, 2024
పెళ్లికి ఫేక్ జువెల్లరీ గిఫ్ట్.. విచారణకు ఆదేశం
యూపీలో వెనుకబడిన అమ్మాయిల పెళ్లిళ్ల కోసం అమలు చేస్తోన్న మాస్ మ్యారేజెస్ స్కీమ్‌లో రోజుకో కొత్త అవినీతి వెలుగుచూస్తోంది. ఇన్ని రోజులు ఫేక్ పెళ్లిళ్లు బయటపడగా తాజాగా ఫేక్ గిఫ్టుల తతంగం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా పెళ్లి చేసుకున్న జంటకు కానుకలు ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు నకిలీ బంగారు ఆభరణాలు, నాణ్యతలేని కానుకలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఓ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
Similar News
News December 10, 2024
మోహన్‌బాబు రాసిన లేఖలో ఇంకేముందంటే?
TG: తాను HYD జల్‌పల్లిలో పదేళ్లుగా ఉంటున్నానని, ఇల్లువదిలి వెళ్లిపోయిన <<14835430>>మనోజ్<<>> 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ CPకి రాసిన లేఖలో మోహన్‌బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా ఆఫీసు సిబ్బందిని 30మందితో బెదిరించాడు. నేను 78ఏళ్ల సీనియర్ సిటిజన్‌ని. రక్షణ కల్పించండి’ అని రాశారు.
News December 10, 2024
డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు
1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
* అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
News December 10, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 10, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు అసర్: సాయంత్రం 4.07 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు ఇష: రాత్రి 7.00 గంటలకు
నోట్: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.