News March 8, 2025

ఫాల్కన్ స్కామ్: నిందితుడి విమానాన్ని సీజ్ చేసిన ఈడీ

image

ఫాల్కన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ విమానాన్ని ఈడీ హైదరాబాద్‌లో సీజ్ చేసింది. అతడు రూ.14 కోట్లతో ఆ విమానాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అమర్‌దీప్ సహా స్కామ్‌లో కీలక నిందితులందరూ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పవన్, కావ్య అనే ఇద్దరు ఈడీ అదుపులో ఉన్నారు. తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి 6979 మందికి రూ.1700 కోట్లకు నిందితులు కుచ్చుటోపీ పెట్టారు.

Similar News

News March 24, 2025

క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు

image

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

News March 24, 2025

దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి

image

కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే మీమ్‌ని ముంబై క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నిన్న జరిగిన MI-CSK మ్యాచ్‌లో దీపక్ 25పరుగులతో పాటు ఒక వికెట్ తీసి చెన్నైకు సులువుగా విజయం దక్కకుండా అడ్డుకున్నారు. గత 7 సీజన్లలో CSK జట్టులో ఉన్న దీపక్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆడిన జట్టుకు ద్రోహం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆమె ఫన్నీ మీమ్ షేర్ చేశారు.

News March 24, 2025

కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 5 అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.

error: Content is protected !!