News November 27, 2024

RCB ఫ్యాన్స్‌, బెంగళూరుతో ప్రేమలో పడిపోయా: ఫాఫ్ డు ప్లెసిస్

image

RCBతో తన మూడేళ్ల ప్రయాణం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ ఇన్‌స్టాలో సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ జట్టుతో అద్భుతమైన ప్రయాణం ముగిసింది. RCB ఫ్యాన్స్, బెంగళూరు సిటీతో ప్రేమలో పడిపోయాను. ఈ జ్ఞాపకాలు జీవితాంతం నాతో ఉంటాయి. చిన్నస్వామి స్టేడియంలో ఆడటం నా కెరీర్లోనే అత్యంత ఉర్రూతలూగించే అనుభూతి. అందరికీ నా కృతజ్ఞతలు. ఈ ప్రయాణం నాకో గౌరవం’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫాఫ్ డీసీకి ఆడనున్నారు.

Similar News

News December 11, 2024

వైద్యులు, ఆర్మీ, టీచర్లపైనే ఎక్కువ నమ్మకం!

image

ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ప్రజలు వైద్యులపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నట్లు తేలింది. 2024లో IPSOS జరిపిన సర్వేలో ఇండియాలో 57శాతం మంది డాక్టర్ వృత్తిపై ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు. దీంతోపాటు ఆర్మీ ఆఫీసర్లను 56%, టీచర్లను 56%, సైంటిస్టులను 54%, జడ్జిలను 52%, బ్యాంకర్స్‌ను 50%, పోలీసులను 47 శాతం మంది నమ్ముతున్నారు. కాగా, రాజకీయ నాయకులు అట్టడుగున ఉన్నట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.

News December 11, 2024

భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 298 పరుగులు చేసింది. ఆ జట్టులో అన్నాబెల్(110) సెంచరీతో చెలరేగారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీశారు. ఛేదనలో స్మృతి మంధాన(105) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. AUS బౌలర్ గార్డ్‌నర్ 5 వికెట్లు తీసి పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

News December 11, 2024

వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్

image

AP: వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ సమాచారమంతా ఒకే వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీలో ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఏఈ ప్లాట్‌ఫాం ఒక్కటే పౌరసేవలు అందిస్తోందని పేర్కొన్నారు.