News September 5, 2024
కూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం.. శిల్పి అరెస్ట్
మహారాష్ట్రలో శివాజీ విగ్రహం <<13945453>>కూలడంతో<<>> ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ విగ్రహ శిల్పి జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్టు చేశారు. స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిర్మాణంలో వీరిద్దరూ నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. 10 రోజులుగా పరారీలో ఉన్న ఆప్టే లొంగిపోతానని భార్య ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News September 16, 2024
మందుబాబులకు బిగ్ రిలీఫ్.. తగ్గనున్న మద్యం ధరలు?
AP: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా GOVT కొత్త లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2019 కంటే ముందు APలో అమలైన పాలసీనే మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విధివిధానాలను క్యాబినెట్ సబ్ కమిటీ దాదాపు ఖరారు చేసింది. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని కమిటీ నిర్ణయించింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత OCT 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే అవకాశముంది.
News September 16, 2024
మోదీ 3.0: ఈసారే జమిలి ఎన్నికలు!
ప్రస్తుత NDA పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో మోదీ 3.0 పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై తన ప్రసంగంలో మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది.
News September 16, 2024
బిగ్ బాస్-8: రెండోవారం షాకింగ్ ఎలిమినేషన్
తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్‌లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్‌తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌లో బాషా పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.