News April 28, 2024
టీడీపీలోకి కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు

AP: కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో శ్రీను తండ్రి జనిపల్లి తాతారావు, తల్లి సావిత్రి, అన్నయ్య సుబ్బరాజు, చిన్నాన్న వెంకటేశ్వరావు TDP కండువా కప్పుకున్నారు. CM జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనుకి బెయిల్ రాకుండా సీఎం అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఐదేళ్లుగా తమకు కూటమి పార్టీల నేతలు, ప్రజా, దళిత సంఘాలు అండగా నిలిచాయన్నారు.
Similar News
News April 14, 2026
శ్రీవారి సంపదకు రక్షకులు ఎవరో తెలుసా?

శ్రీవారి ఆలయంలోని నిధులు, సంపదలను రక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వారే శంఖనిధి, పద్మనిధి. వీరి విగ్రహాలు ఆలయ మహద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. మనం క్యూలో లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకుల్లా కనిపించేది వీరే. ఈ విగ్రహాలు దాదాపు రెండడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని పంచ లోహాలతో తయారు చేశారు. ఈ దేవతలు శ్రీవారి ధనాన్ని కాపాడే ముఖ్యమైన రక్షకులుగా భక్తులు భావిస్తారు.
News April 14, 2026
గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.
News April 14, 2026
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.


