News April 9, 2024
దారుణంగా ‘ఫ్యామిలీ స్టార్’ వసూళ్లు?

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.19 కోట్లు రాబట్టినట్లు సమాచారం. రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.45 కోట్లు రాబట్టాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
Similar News
News November 25, 2025
ఆ మెసేజ్‌లు నమ్మొద్దు.. బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్

తన పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దని హీరోయిన్ రకుల్ ప్రీత్ సూచించారు. 8111067586 నంబర్‌తో నకిలీ వాట్సాప్ ఖాతా ఉందని, వెంటనే బ్లాక్ చేయాలంటూ ఫ్యాన్స్‌ను కోరారు. తన ఫొటోను DPగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి, కొందరు సందేశాలు పంపినట్లుగా గుర్తించినట్లు స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. గతంలోనూ అదితి రావు, రుక్మిణీ వసంత్ వంటి హీరోయిన్లకు ఇదే తరహా అనుభవం ఎదురైంది.
News November 25, 2025
తెలంగాణలో పెరుగుతున్న భూగర్భ జలమట్టం

TG: గత పదేళ్లుగా వర్షాకాలం తర్వాత కూడా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో పదేళ్లుగా భూగర్భ జలమట్టం పెరుగుతోందని TG జలవనరులశాఖ తెలిపింది. ఆసిఫాబాద్, నిర్మల్, KMR, NZB, ADB, పెద్దపల్లి, SDP, MDK, WGL, HNK, MHBD, SRPT, MBNR, NGKL, గద్వాల, NRPT,VKB, SRD, NLG, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మండలాల్లో జలమట్టం పెరిగింది.
News November 25, 2025
నవంబర్ నారీమణులదే

ఈ నెలలో భారత నారీమణులు ప్రపంచ వేదికలపై అదరగొట్టారు. ఈ నెల 2న భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలవగా, 23న అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. నిన్న ఉమెన్ ఇన్ బ్లూ కబడ్డీ వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. ఈ విజయాలు క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు మరింత ఉపయోగపడుతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ నెలలో మహిళలు డామినేట్ చేశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.


