News April 9, 2024
దారుణంగా ‘ఫ్యామిలీ స్టార్’ వసూళ్లు?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.19 కోట్లు రాబట్టినట్లు సమాచారం. రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.45 కోట్లు రాబట్టాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
Similar News
News November 3, 2024
INDvsNZ: బ్యాటర్లపైనే భారం
వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఫలితం నేడు తేలే ఛాన్సుంది. ప్రస్తుతం 9 వికెట్లు కోల్పోయిన కివీస్ 143 రన్స్ లీడ్‌లో ఉంది. ఆ జట్టుకు 150 రన్స్‌కి మించి లీడ్ ఇవ్వొద్దని భారత్ భావిస్తోంది. టార్గెట్ 150 రన్స్‌లోపు ఉంటే రోహిత్‌సేన కంఫర్టబుల్‌గా ఛేజ్ చేసే అవకాశం ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక మన బ్యాటర్లపైనే భారం ఉంది.
News November 3, 2024
వచ్చే నెలలోనే ఎన్నికలకు అవకాశం: పొంగులేటి
TG: డిసెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంక్రాంతిలోపు పంచాయతీలకు కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లు వస్తారని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచుల పాలన ముగిసింది. వారి స్థానంలో ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. కాగా కులగణన ఆధారంగా సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.
News November 3, 2024
2 రోజుల్లో ఎన్నికలు.. కమలా హారిస్ ఎమోషనల్ పోస్ట్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మా అమ్మ శ్యామలా గోపాలన్ హారిస్ 19 ఏళ్ల వయసులో ఇండియా నుంచి అమెరికా వచ్చారు. ఆమె ధైర్యం, అంకితభావం వల్లే ప్రస్తుతం నేనిలా ఉన్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, అమెరికాలో ప్రవాస భారతీయ ఓటర్లు 26 లక్షల వరకు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారని విశ్లేషకుల అభిప్రాయం.