News February 27, 2025

ప్రముఖ నటుడు మృతి

image

హాలీవుడ్ యాక్టర్, రెండుసార్లు ఆస్కార్ విజేత జీన్ హ్యాక్‌మ్యాన్ (95) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూమెక్సికోలోని ఇంట్లో జీన్, ఆయన భార్య, పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ‘The French Connection’, ‘Bonnie and Clyde’, ‘The Royal Tenenbaums’ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. 2 ఆస్కార్, 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సాధించారు.

Similar News

News March 26, 2025

వేసవిలో ఎక్కువగా చికెన్ తింటున్నారా?

image

కొందరికి చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అయితే వేసవి కాలంలో రెగ్యులర్‌గా చికెన్ తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగి తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ పెరగడం, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. కండరాల నొప్పులు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వారంలో ఒకటి రెండు సార్లు తింటే ప్రమాదం లేదని పేర్కొంటున్నారు.

News March 26, 2025

టూరిజం అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి సారించాలని CM చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రానికి తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో అభివృద్ధికి ఛాన్స్ ఉందని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో CM మాట్లాడారు. ‘ఉమ్మడి జిల్లాల్లోని ఆఫీసర్లతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల్లోని అధికారులను స్వేచ్ఛగా పని చేయనివ్వాలి. ఇందుకు సంబంధించి 2 రోజుల్లోనే ఆదేశాలు జారీ చేయాలి. సిబ్బంది కొరత ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు.

News March 26, 2025

జొమాటో, స్విగ్గీ షేర్ల పతనం.. కారణమిదే!

image

జొమాటో, స్విగ్గీ షేర్లు ఈరోజు తడబడ్డాయి. జొమాటో 5శాతం, స్విగ్గీ 1.88శాతం మేర తగ్గాయి. BoFA బ్రోకరేజీ సంస్థ వాటి రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడమే దీనిక్కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. జొమాటోను ‘కొనుగోలు’ నుంచి ‘న్యూట్రల్‌’కు, స్విగ్గీని ‘కొనుగోలు’ నుంచి ‘తక్కువ ప్రదర్శన’ స్థాయికి BoFA తగ్గించింది. ఫుడ్ డెలివరీ రంగాల్లో నష్టాల ఆధారంగా డౌన్‌గ్రేడ్ చేసినట్లు ఆ సంస్థ వివరించింది.

error: Content is protected !!