News December 7, 2024
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు జయభారతి(77) కన్నుమూశారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. 1979లో క్రౌడ్ ఫండింగ్ విధానంలో కుడిసై సినిమా తీసి గుర్తింపు పొందారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో కేవలం 9 సినిమాలకే దర్శకత్వం వహించారు. పాత్రికేయుడిగా పనిచేస్తూ ప్రముఖ దర్శకుడు బాలచందర్‌కు పరిచయమయ్యారు. హీరోగా నటించాలని కోరగా, జయభారతి తిరస్కరించారు.
Similar News
News January 16, 2025
PHOTOS: మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా
పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్ రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రంగు రంగుల బల్బుల వెలుగుల్లో త్రివేణీ సంగమం భువిపై వెలసిన స్వర్గంలా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా మహాకుంభమేళాకు మూడు రోజుల్లో 6 కోట్ల మందికి పైగా హాజరయ్యారని సమాచారం.
News January 16, 2025
నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 8 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సింగపూర్ వెళ్లనున్న ఆయన అంతర్జాతీయ సౌకర్యాలతో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్నారు. ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలువురితో ఒప్పందాలు చేసుకోనున్నారు.
News January 16, 2025
3 రోజులు జాగ్రత్త
TGలో చలి తీవ్రత మరో మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.