News August 5, 2024
దేవరపై ఫ్యాన్ కామెంట్.. రామజోగయ్య శాస్త్రి కౌంటర్
ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు దేవర మూవీ నుంచి ‘చుట్టమల్లె’ పాట విడుదల కానుంది. ఎన్టీఆర్‌కు ఇలాంటి పాట వచ్చి చాలాకాలమైందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విటర్‌లో పేర్కొనగా ఓ నెటిజన్ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఇంత హైప్ ఇస్తున్నారు. అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్’ అని హెచ్చరించాడు. దానిపై శాస్త్రి స్పందించారు. ‘హైప్ కాదు నిజం. సాయంత్రం మళ్లీ చెప్పు, ఇక్కడే ఉంటా’ అని అతడికి కౌంటర్ ఇచ్చారు.
Similar News
News September 8, 2024
రేపు 400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున విరాళం: నాదెండ్ల
AP: వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు ₹లక్ష చొప్పున రేపు విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పంచాయతీలను ఆదుకునేందుకు dy.cm పవన్ సొంత నిధుల నుంచి ₹4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని సూచించారు.
News September 8, 2024
వినాయక చవితి వేడుకల్లో బంగ్లాదేశ్ క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో తన నివాసంలో గణేషుడి ప్రతిమకు పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ‘గణపతి బొప్ప మోరియా’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దాస్ సెంచరీతో ఆకట్టుకున్నారు.
News September 8, 2024
రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా ఇదే..
AP: రాష్ట్రంలో వరదల వల్ల రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా R&B రూ.2164.5 కోట్లు, నీటివనరులు రూ.1568.5 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1160 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖ రూ.481 కోట్లు, వ్యవసాయం రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్ల విభాగం రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.