News February 4, 2025
అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు.. కానీ: రొనాల్డో

రొనాల్డో – మెస్సీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు అని ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అన్నారు. ‘కానీ సాకర్ చరిత్రలో ఇప్పటివరకూ నా లాంటి ప్లేయర్‌ని చూసుండరు. నేనే కంప్లీట్, బెస్ట్ ప్లేయర్‌ని’ అని తెలిపారు. మెస్సీకి తనకు మంచి స్నేహం ఉందన్నారు. స్పానిష్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో రొనాల్డో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Similar News
News April 7, 2026
యుద్ధం ఆగకపోతే $140కు క్రూడాయిల్!

ఈ నెలాఖరులోగా పశ్చిమాసియాలో యుద్ధం ఆగకపోతే క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ వెల్లడించింది. ప్రస్తుతం బ్రెంట్ రకం బ్యారెల్ రేటు $109-$110 మధ్య ఉండగా $130-$140కి చేరనుందని అంచనా వేసింది. వార్ మరో 6 నెలలు కొనసాగితే మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని తెలిపింది. జీడీపీ గ్రోత్ 7 నుంచి 6-5.8 శాతానికి పడిపోవచ్చంది. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది.
News April 7, 2026
గీతలు పడిన నాన్-స్టిక్ కుక్‌వేర్ వాడుతున్నారా?

నాన్-స్టిక్ వంట పాత్రలు మన శరీరంలో శాశ్వతంగా టాక్సిక్ కెమికల్స్ ఏర్పడటానికి కారణమవుతాయని అపోలో MD సంగీతారెడ్డి వెల్లడించారు. గీత పడిన కుక్‌వేర్‌లో వండే ఫుడ్ తింటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని, పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ విషయంపై అందరూ అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. కాగా ఓ స్టడీ ప్రకారం టెఫ్లాన్ కోటెడ్ వంటపాత్రలపై ఒక గీత పడితే 9Kకు పైగా మైక్రో, నానోపార్టికల్స్ రిలీజవుతాయి.
News April 7, 2026
కరెంట్ అఫైర్స్ (07-04-2026)

*భూమి నుంచి అత్యంత దూరం (4,06,764kms) ప్రయాణించిన మానవసహిత మిషన్‌గా ‘ఆర్టెమిస్-2’ రికార్డు
* న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో రెండో దశకు భారత్.. కల్పాక్కం(TN)లోని ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ స్థాయికి చేరుకుందని PM మోదీ ప్రకటన
*AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల.. 2024, జూన్ 2 నుంచి రాజధాని హోదా
*IPLలో 200 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా భువనేశ్వర్ రికార్డు


