News February 4, 2025
అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు.. కానీ: రొనాల్డో

రొనాల్డో – మెస్సీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు అని ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అన్నారు. ‘కానీ సాకర్ చరిత్రలో ఇప్పటివరకూ నా లాంటి ప్లేయర్‌ని చూసుండరు. నేనే కంప్లీట్, బెస్ట్ ప్లేయర్‌ని’ అని తెలిపారు. మెస్సీకి తనకు మంచి స్నేహం ఉందన్నారు. స్పానిష్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో రొనాల్డో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Similar News
News February 19, 2025
శివాజీ జయంతికి రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి..

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జయంతి వేళ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాయడమే ఇందుకు కారణం. సాధారణంగా వర్ధంతులకే ఇలా చెప్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ శివాజీ విగ్రహాలను తీసుకొనేందుకు ఆయన వెనుకాడటం, నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు యూజర్లు గుర్తుచేస్తున్నారు.
News February 19, 2025
ఢిల్లీ CM ఎన్నిక: అబ్జర్వర్లను నియమించిన BJP

ఢిల్లీ CM అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. PM మోదీ నివాసంలో సమావేశమైన పార్లమెంటరీ ప్యానెల్ రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాశ్ ధన్‌ఖడ్‌ను అబ్జర్వర్లుగా నియమించింది. 7PMకు BJP MLAలు సమావేశం అవుతారు. అక్కడ వీరిద్దరూ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. అంటే రాత్రి వరకు అభ్యర్థి ఎవరో తేలే అవకాశం లేదు. మరోవైపు DCC చీఫ్, కేజ్రీవాల్, ఆతిశీని ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది.
News February 19, 2025
CT: తొలి మ్యాచులో బ్యాటింగ్ ఎవరిదంటే?

ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచుకు తెరలేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
PAK: ఫకర్ జమాన్, బాబర్, షకీల్, రిజ్వాన్(C), సల్మాన్, తాహిర్, అఫ్రీది, నసీమ్, రవూఫ్, అహ్మద్.
NZ: కాన్వే, యంగ్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సాంట్నర్(C), నాథన్ స్మిత్, హెన్రీ, విలియమ్ ఓరౌర్కే.