News December 20, 2024
ధరణితో రైతులకు భూములు దూరం: CM
తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేదే భూమి అని CM రేవంత్ అన్నారు. భూభారతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడారు. ‘భూమిలేని పేదలకు ఇందిరా సర్కార్ భూమిచ్చింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. కానీ BRS ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం అన్నదాతలను తమ భూములకు దూరం చేసింది. యువరాజు(KTR)కు అత్యంత సన్నిహితులైన వారికి దీని పోర్టల్‌ను అప్పగించారు’ అని ఆరోపించారు.
Similar News
News January 23, 2025
‘ఏమైనా సరే.. FEB 20లోపు డెలివరీ చేయండి’
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన <<15211801>>కొత్త రూల్<<>>తో అక్కడి ఇండోఅమెరికన్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 20లోపు జన్మించే పిల్లలకు మాత్రమే అక్కడి పౌరసత్వం లభించనుంది. దీంతో ఇప్పటికే గర్భంతో ఉన్నవారు ఫిబ్రవరి 20లోపు డెలివరీ జరిగేలా వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. నెలలు నిండకుండానే సి-సెక్షన్లు చేయాల్సిందిగా వైద్యులకు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.
News January 23, 2025
పెట్టుబడులు మూడింతలు.. 46 వేల ఉద్యోగాలు!
దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా అమెజాన్‌తో కలుపుకొని పెట్టుబడులు మొత్తం రూ.1.32 లక్షల కోట్లు దాటాయి. వీటితో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే <<15233398>>పెట్టుబడులు దాదాపు మూడింతలు<<>> మించిపోయాయి.
News January 23, 2025
జైలు శిక్షపై స్పందించిన RGV
చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVకి 3 నెలలు<<15232059>> జైలు శిక్ష <<>>పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై RGV స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.