News October 28, 2024

‘కటాఫ్ డేట్’తో రైతులకు ఇక్కట్లు

image

కటాఫ్ డేట్ నిబంధన కారణంగా పీఎం కిసాన్ పథకానికి లక్షలాది మంది రైతులు దూరమవుతున్నారు. 2018 డిసెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి 1 మధ్య భూమి ఎవరి పేరుతో ఉంటే వారికే ఏటా రూ.6వేలను కేంద్రం అందిస్తోంది. ఆ తేదీ తర్వాత భూమి కొనుగోలు చేసినవారు, వారసత్వంగా పొలం సంక్రమించినవారికి పీఎం కిసాన్ లబ్ధి చేకూరడం లేదు. అందరికీ డబ్బులు అందేలా కేంద్రం నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News November 2, 2025

పసుపుతో అందమైన పెదాలు

image

ముఖ సౌందర్యంలో పెదాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేచురల్‌గా అందంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించండి. * పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. * చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి.

News November 2, 2025

విజయవాడకు జోగి రమేశ్ తరలింపు!

image

AP: కల్తీ మద్యం కేసులో <<18175333>>అరెస్టైన<<>> మాజీ మంత్రి జోగి రమేశ్‌ను పోలీసులు విజయవాడకు తరలించారు. ఎక్సైజ్ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆయనను విచారించనున్నారు. మరోవైపు జోగి రమేశ్ అరెస్టుతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.

News November 2, 2025

ఏపీ రౌండప్

image

* పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు రెండేళ్ల సర్వీసును ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పంట నష్టం అంచనాల నమోదుకు గడువును ఈ నెల 7 వరకు పెంచాలని కౌలురైతు సంఘం డిమాండ్
* సమ్మె కాలాన్ని పనిరోజులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ పీహెచ్‌సీ ఉద్యోగుల సంఘం
* పన్నులు తగ్గినా రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గత అక్టోబర్‌తో పోలిస్తే 8.77శాతం వృద్ధి