News October 28, 2024
‘కటాఫ్ డేట్’తో రైతులకు ఇక్కట్లు
కటాఫ్ డేట్ నిబంధన కారణంగా పీఎం కిసాన్ పథకానికి లక్షలాది మంది రైతులు దూరమవుతున్నారు. 2018 డిసెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి 1 మధ్య భూమి ఎవరి పేరుతో ఉంటే వారికే ఏటా రూ.6వేలను కేంద్రం అందిస్తోంది. ఆ తేదీ తర్వాత భూమి కొనుగోలు చేసినవారు, వారసత్వంగా పొలం సంక్రమించినవారికి పీఎం కిసాన్ లబ్ధి చేకూరడం లేదు. అందరికీ డబ్బులు అందేలా కేంద్రం నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News November 3, 2024
ALERT.. పొంచి ఉన్న మరో వాయుగుండం
AP: ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., బాపట్ల, ప్రకాశంతో పాటు రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 3, 2024
బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్
TG: కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ Xలో కౌంటర్ ఇచ్చారు. రైతులకు పింఛన్, 2 కోట్ల ఉద్యోగాలు, అకౌంట్లలో రూ.15 లక్షలు ఇలా BJP ఎగ్గొట్టిన హామీలు చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని దుయ్యబట్టారు.10 నెలల ప్రజా ప్రభుత్వంపై సంజయ్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని, చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడాలని హితవు పలికారు.
News November 3, 2024
ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం సబబే: హైకోర్టు
AP: నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన మహిళను సర్వీస్ నుంచి తొలగించడం సబబేనని హైకోర్టు తీర్పునిచ్చింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. నెలలోపు విశాఖపట్నంలోని ఓంకార్ అండ్ లయన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆ డబ్బును చెల్లించాలని ఆదేశించింది. వినికిడి లోపం ఉందని ఫేక్ సర్టిఫికెట్‌తో దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించిన ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట నాగ మారుతిని విద్యాశాఖ తొలగించింది.